wp-1477818783072.jpgwp-1477818773789.jpg
దీపావళికి ఒక రోజు ముందే మెగా ఫ్యామిలీ తన అభిమానులకు పండుగను తీసుకొచ్చింది. ‘ఖైదీ నంబర్‌ 150’, ‘కాటమరాయుడు’ పోస్టర్లను విడుదల చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇక దీపావళి రోజున రామ్‌చరణ్‌ తన అభిమానులకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ ‘ధృవ’ సినిమా పోస్టర్లను విడుదల చేశారు. తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా దీపావళి స్పెషల్‌ గిఫ్ట్‌ అంటూ రెండు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ధృవ’ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తనీ ఒరువన్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్‌లో ‘ధృవ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

wp-1477818773789.jpg

Category:

Telugu Movies news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*