హిందూ మతంలో విశ్వాసకులు ఒక సర్వశక్తిమంతమైన దేవత/దేవుడిని నమ్ముతారు, కానీ, పూజించే విషయానికి సంబంధించినంత వరకూ, ఆమె/అతడిని అనేక రకాలుగా వ్యక్తీకరించబడిన రూపంలో పూజించవచ్చు, ఈ అనేక రూపాలు దేశమంతా ప్రబలంగా వ్యాపించి ఉన్నవి. నవరాత్రి దుర్గా దేవి ఉత్సవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, దుర్గాదేవి, శక్తి ఆకృతిలో వ్యక్తీకరించబడిన దేవత (శక్తి లేదా బలము). దసహరా అంటే ‘పది రోజులు’, ఇది వాడుక భాషలో దసరా అవుతుంది. నవరాత్రి పండుగ లేదా ‘తొమ్మిది రాత్రుల పండుగ, చివరి దినాన, అంటే విజయదశమి రోజున పరాకాష్టకు చేరుకుని ‘పది రోజుల పండుగ’ అవుతుంది. ఈ పదిదినాలలోనూ, మహిషాసురమర్ధిని అయిన దుర్గా మాత యొక్క అనేక రూపాలను ఆరాధనతో, భక్తితో పూజిస్తారు.

 

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి అంటారు. అలాంటి అమ్మ రూపంలో ఒక్కో రూపానికి ఒక్కో అర్ధం దాగుంది.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

 

దుర్గా మాతకు 8 నుండి 10 చేతులు:

దుర్గా మాత అంటేనే శక్తి స్వరూపిని ఆమెకు 8 నుండి 10 చేతులు ఉంటాయి. ఈ ఎనిమిది లేదా 10 చేతులు పది విధాలుగా డైరెక్షన్స్ లేదా సలహాలను సూచిస్తుంది.అన్ని డైరెక్షన్స్ లో భక్తులను రక్షిస్తుంది.

మూడో కన్ను:

 

లార్డ్ శివ తర్వాత మూడవ కన్ను కలిగినది, దుర్గా మాత, అందుకు దుర్గా మాతను ‘‘త్రయంబకే” అని కూడా పిలుస్తారు. మూడు కన్నులు ఒక్కో సంకేతాన్ని సూచిస్తుంది. ఎడమ కన్ను కోరిక(చంద్రుడు)ని, కుడికన్ను చర్య (సూర్యుడి)ను, మద్య కన్ను లేదా మూడో కన్ను జ్ఝానాన్ని(అగ్ని)ని సూచిస్తుంది.

 

శంకం :

దుర్గమాత చేతిలో శంఖం ‘‘ప్రణవం” లేదా ‘‘ఓం”కు సంకేతం . ఈ సంకేతం ద్వని రూపంలో ‘‘ఓం”అనే శక్తిని పట్టుకున్నట్లు సంకేతం సూచిస్తుంది.

దుర్గ మాత వాహనం-సింహం:

లయన్ (సింహం) శక్తి, సంకల్పం, నిర్ణయంను సూచిస్తుంది. దుర్గా మాత సింహాం మీద స్వారీ చేయడాన్ని పాండిత్యం సూచిస్తుంది.

చేతిలో విల్లు , బాణం:\

ఒక చేతిలో విల్లు మరియు భాణం ఎనర్జీనికి సంకేతం. ఇవి శక్తి ని సూచిస్తాయి.ధనుర్బాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని అమ్మవారు తెలియచేస్తున్నట్లు.

గద:

దుర్గా మాత చేతిలో ఉండే చక్రం ధృడ సంకాల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంత ధృడం గా వ్యవహరించాలనీ ,ఎటువంటి ఆపద ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యం తో ఎదుర్కోవాలనీ అర్ధం.

 

తామర పువ్వు:

దుర్గా మాత చేతిలో ఉండే తామర పువ్వు పూర్తిగా విచ్చుకుని ఉండదు. ఇది సక్సెస్ కు సంకేతం .అంటే సఫలత అనివార్యమనీ కానీ అదే ఆఖరు మజిలీ కాదనీ అర్ధం.సంస్కృతం లో కమలాన్ని ‘పంకజం’ అంటారు. అంటే బురద నుండి పుట్టినది అని అర్ధం. బురదలో కమలం వికసించినట్లు దురాశ, కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికతని వికసింపచేసుకోవాలని సూచన అన్నమాట

 

సుదర్శన చక్రం:సుదర్శన చక్రం దుర్గా మాత యొక్క చూపుడు వేలు పైన వేలుకి తాకకుండా తిరుగుతూ ఉంటుంది.అంటే ఈ విశ్వం అంతా ఆ మాత యొక్క ఆఙకి లోబడి నడుస్తోందనడానికి సూచన.చెడు ని సంహరించి మంచి ని వృద్ధి చెయ్యడానికి ఈ సుదర్శన చక్రాన్ని అమ్మవారు వాడుతుంది.

 

ఖడ్గం :

దుర్గా మాత ధరించే ఖడ్గం కత్తి వంటి పదును గల ఙానాన్ని సూచిస్తుంది. అన్ని సందేహాల నుండీ విముక్తమైన జ్జానం కత్తి వాదర వలే మెరుస్తుంది.

త్రిశూలం:

త్రిశూలం మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక.శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గా మాత తొలగిస్తుంది.

 

అభయ ముద్ర:

ఇది అభయముద్ర. అంటే భయం నుండి విమోచనని సూచిస్తుంది. ఈ ముద్రలో అమ్మవారు భక్తులనుద్దేశించి ‘ మీ కార్యాలు, విధుల భారాన్ని నా మీద వెయ్యండి, మిమ్మల్ని అన్ని భయాల నుండీ విముక్తులని చేస్తాను’ అన్నట్లుగా ఉంటుంది.

మీకు నచ్చితే షేర్ చేయండి మరియు మీ Reaction చెప్పండి…..

Category:

Interesting news