తెరచుకున్న అయ్యప్ప ఆలయం
wp-1479266162058.png
శబరిమలలో శోభ ఆరంభంనేడు మహాగణపతి హోమం, అభిషేకాలుతిరువనంతపురం, నవంబరు 15: శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని మంగళవారం తెరిచారు. ఈ ఏడాది అయ్యప్ప సీజన్‌ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. 41 రోజులపాటు నిర్వహించే మండలం పండుగ గురు వారం నుంచి మొదలవుతోంది. తొలి రోజునే స్వామి దర్శనం చేసుకునేందుకు అప్పుడే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. కొద్ది రోజుల్లో భారీసంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. నిరుడు 4.5 కోట్లమందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రధానార్చకుడు కందరారు రాజీవరారు వెంటరాగా, త్వరలో బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ప్రధానార్చకుడు ఎస్‌ఈ శంకరన్‌ నంబూద్రి మంగళవారం సాయంత్రం గర్భాలయాన్ని తెరవడంతో కార్యకలాపాలు సంప్రదాయసిద్ధంగా ప్రారంభమయ్యాయి.

ప్రధానార్చకుడు బుధవారం ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం నిర్వహిస్తారు. తెల్లవారుజామున మూడున్నరకు అష్టాభిషేకం చేసిన తర్వాత.. నేతితో అభిషేకం చేస్తారు. మండలపూజ తర్వాత డిసెంబరు 26న మండలం పండుగ ముగుస్తుంది.

ఆదే రోజు సాయంత్రం గుడిని మూసివేస్తారు. ‘మకరవిలక్కు’ పండుగ కోసం ఆలయాన్ని మళ్లీ డిసెంబరు 30న తెరుస్తారు. జనవరి 14న భక్తులు మకరజ్యోతిని దర్శించుకుంటారు. జనవరి 20న గుడిని మూసివేస్తారు.

Category:

Uncategorized