చిత్రసీమలో నటీనటులు-దర్శకుల మధ్య క్లాష్ కొత్తకాదు. కానీ ఈ విబేధాలు, వేధింపులు ఎదుటి వారిని ఆత్మహత్యాయత్నం దిశగా పురికొల్పిందంటేనే వింత. ఓ వ్యక్తి ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడంటే మరి ఆ హింసా పర్వం ఏ రేంజ్‌లో ఉందో సులువుగానే అర్ధం చేసుకోవచ్చు. అసలు విషయంలోకి వచ్చేస్తే.. గత నెల 28న మలయాళ నటి అతిథి అలియాస్ అథిరా సంతోష్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తమిళ చిత్రసీమకు చెందిన దర్శకుడు సెల్వకణ్ణన్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతిథిని సెల్వకణ్ణన్ ‘నెదునల్వాడై’ సినిమా కోసం సెలక్ట్ చేసుకున్నాడు. అతడి కారణంగా ఈమె ఆత్మహత్యకు యత్నించడం కోలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. నడిగర్ సంఘం అధినేత విశాల్ ఆమెను పరామర్శించి దర్శకుడి వేధింపుల పూర్వాపరాలు ఆరాతీశాడు. కణ్ణన్ నడిగర్ సంఘంలో సభ్యుడు కాకపోవడంతో తమ సంఘం తరపున అతడిపై చర్యలు తీసుకోలేమన్న విశాల్ వివరణతో అతిథి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, అతిథి తన సినిమాలో భాగమైన నాటి నుంచి కణ్ణన్ ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో క్లోజ్‌గా ఉన్న హీరోను తొలగించేశాడు. ఈ ఎపిసోడ్ తర్వాత ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమె వెంటపడ్డాడు. అతిథి కాదనడంతో చంపుతానంటూ బెదిరించాడు. ఈ టార్చర్‌ తట్టుకోలేకే విషం తాగానని చెప్పుకొచ్చింది అతిథి.

Category:

Telugu Movies news