మీ జుట్టు అధికంగా రాలుతుందా? స్త్రీ మరియు పురుషుల ఇద్దరిలోనూ జుట్టు రాలటం అనేది చాలా సాధారణం. ప్రస్తుతకాలంలో యువకులు లేదా యుక్తవయసు గల వారిలో ప్రారంభం అవుతుంది. పురుషులలో అనారోగ్యకర జీవన శైలి మరియు వంశపారంపర సంక్రమణగా దీనిని పేర్కొనవచ్చు కానీ, స్త్రీలలోజుట్టు రాలటానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ముందుగా ఈ సమస్యకు మూలాధారం ఏంటో తెలుసుకోవటం ముఖ్యం.  నిజానికి జుట్టు రాలటాన్ని నివారించి, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషదాలు మన ఇంట్లో చాలానే ఉన్నాయి. జుట్టు రాలటాన్ని సహజంగా నివారించుకోవాలనుకుంటున్నారా! అయితే వెల్లుల్లి కన్నా వేరే మంచి ఔషదం ఏముంది?

వెల్లుల్లి మరియు

జుట్టు గురించి

పరిశోధనలు ఏమ్

చెప్తున్నాయి?

ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ” వారు ప్రచురించిన అధ్యయనాల ప్రకారం, తలపై చర్మానికి వెల్లుల్లి జెల్ అప్లై చేయటం వలన జుట్టు రాలిపోయిన ప్రదేశంలో వెంట్రుకలు వస్తాయని తెలిపారు. సల్ఫర్ మరియు సెలీనియం కలిగి ఉండే వెల్లుల్లి వెంట్రుకల నిర్మాణాన్ని ద్రుదపరచటమేకాకుండా, జుట్టు మొదళ్లకు మరియు తలపై చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.


వెంట్రుకలకు వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది?

వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే. దీని వలన తలపై చర్మానికి సూక్ష్మ క్రిములు, ఈస్ట్ మరియు ఫంగస్ సోకటాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా, వెల్లుల్లి జుట్టు షాఫ్ట్ పరాన్నజీవులు సంక్రమణను కూడా నివారిస్తుంది. వెల్లుల్లిని వినియోగించటం వలన తలపై చర్మంలో కలిగే దురదల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు, తలపై చర్మంలో ఉండే విషపదార్థాలు మరియు మలినాలను తొలగించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.


వెల్లుల్లిను ఎలా వాడటం?

వెల్లుల్లి సహజ నూనెలు

జుట్టు రాలటాన్ని తగ్గించుటకు వెల్లుల్లిని ఎపుడైనా వాడరా? అయితే దీనిని వాడటం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రకం సహజ నూనెను మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంటలలో వాడిన విధంగానే వెల్లుల్లిని వలిచి, చిన్న చిన్న ముక్కలుగా చేసి వారం లేదా రెండు వారాల పాటు ఆలివ్ ఆయిల్ లో నానబెట్టండి. పుల్లగా లేదా పాడవకుండా ఉందా ఉండాలంటే దీనిని ఫ్రిజ్ లో ఉంచండి.


వెల్లుల్లి పిల్స్

జుట్టు రాలటాన్ని నివారించుటకు గానూ, వాసన లేను వెల్లుల్లి పిల్స్ లను దగ్గరలో ఉండే మందుల షాపు నుండి పొందవచ్చు. రోజుకు సరైన స్థాయిలో మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు.

కండిషనర్ గా తాజా వెల్లుల్లి

వెల్లుల్లిని ఉపయోగించి జుట్టు రాలటాన్ని తగ్గించుటకు అందుబాటులో ఉన్న మరొక పద్దతి వాడే కండిషనర్ కు వెల్లుల్లి కలపటం.


పచ్చి వెల్లుల్లి

జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకలను పెరుగుదలను అధికం చేసుకోటానికి పచ్చి వెల్లుల్లిను తలపై చర్మానికి అప్లై చేయండి.

Category:

Telugu health tips

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*