ayyapa-1

కార్తీక మాసం మొదలుకుని 41 రోజుల పాటు ఆలయాల్లో నిత్యం ఆధ్యాత్మిక శోభ ఉంటుంది. దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గం దిశగా పయనించడానికి కార్తీకమాసం వారధిగా నిలుస్తోంది. కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్పస్వామి దీక్ష తీసుకుంటారు. సాధారణంగా రోజూ ఇంట్లోనో, ఆలయాల్లోనో దైవ నామస్మరణ, పూజలు చేస్తుంటాం.
వాటన్నింటికీ భిన్నంగా అయ్యప్ప దీక్ష నియంత్రణాత్మ, ఆధ్యాత్మిక సోపానంగా భావిస్తూ పలువురు దీక్షబూనుతారు. కాలక్రమేణా ఇదే రీతిలో భవానీ, శివ, హనుమాన్‌, సాయి దీక్షలు ఏర్పడ్డాయి. వస్త్రాల రంగుల్లో మార్పులున్నా దాదాపు అందరి నియమాలు నిష్టలూ ఒక్కటే. క్రమ పద్ధతిలో మండలం రోజులు జీవనయానం సాగిస్తారు.
దీక్షల సమయంలో ఉదయం, సాయంత్రం నియమాలు పాటిస్తారు. బాహ్య ప్రపంచాన్ని, ఒత్తిడిని ప్రతిరోజూ రెండు గంటల సేపు మరిచిపోతారు. వీటి వెనుక ఆధ్యాత్మిక, తాత్విక, సైన్సు కోణాలు దాగుండడం విశేషం. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. ఆ నియమాల అంతర్యమేమిటో చూద్దామా..!!

శిరస్నానం

ayyapa
ఆధ్యాత్మికం : అభ్యంగస్నానం దేవునికి ప్రీతి కరం.
తాత్వికం : మనుసుకు హాయినిస్తుంది. చెడు భావాలను దూరం చేస్తుంది. లక్ష్యం (దైవం)పై ఏకాగ్రత కుదురుతుంది.
వైజ్ఞానికం : శిరోభాగం (మెదడు) ఆలోచనలకు కేంద్ర బింధువు. అంటే క్రియ (పని) చేస్తుంది. క్రియ ఉన్న ప్రతిచోట ఘర్షణ (రాపిడి) ఉంటుంది. దీని వల్ల ఉష్ణం ఏర్పడుతుంది. అధిక ఉష్ణం ఆరోగ్యానికి నష్ట దాయకం. చన్నీళ్లు ఆ ఉష్ణాన్ని ఉపశమింపజేస్తుంది.

చందనం వాడకం

ayyapa-namam
ఆధ్యాత్మికం : నుదురు దైవస్థానం. భృకుటి స్థానంలో పెట్టుకునే నామం దైవానికి ఎంతో ఇష్టం.

తాత్వికం : రెండు కనుబొమ్మల మధ్యన నుదుటిభాగం యోగ రీత్యా విశిష్టమైంది. పాలభాగంగా పిలిచే ఈ ప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది అనేది తాత్వికుల భావన. దానికి అనుగుణంగా అక్కడ కుంకుమ, విభూది, గంధం, చందనాల్లో ఏదో ఒక్కటి పెట్టుకుంటారు.

వైజ్ఞానికం : నాడీ మండలానికి కేంద్రం నుదుటిభాగం. అక్కడ సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యదాయకం.

వస్త్రధారణ

sabarimala-deeksha2ఆధ్యాత్మికం : అయ్యప్ప భక్తులు నల్లటి వస్త్రాలు ధరిస్తారు. ఈ దుస్తులు ధరించిన వారిపై శని దేవుని చూపు పడదని భక్తుల విశ్వాసం.
తాత్వికం : నలుపు ఆకర్షనలకు దూరంగా ఉండి అన్ని ఇహ పర సుఖాలను తృజించమని చెబుతుంది.
వైజ్ఞానికం : నలుపు రంగుకు ఉష్ణాన్ని గ్రహంచే శక్తి ఉంటుంది. దేహ ఉష్ణోగ్రతను దీక్ష ఉపవాసాలు తగ్గిం చేస్తాయి. ఈ దుస్తులు ఉష్ణాన్ని సమతుల్యం చేస్తాయి.
ఆహరం తక్కువగా తీసుకోవడం
ఆధ్యాత్మికం : మితాహారమే ఆరోగ్యం.. మితాహారం తీసుకోవడం ద్వారా కొవ్వు శరీరంలో చేరేందుకు

ఆస్కారం ఉండదు.

lord-ayyappa-8-1024-x-768
తాత్వికం : ఆహారం మితంగా తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఎలాంటి బద్దకం లేకుండా రెట్టింపైన ఉత్సాహంతో పరుగెట్టేందుకు వీలుంటుంది.
వైజ్ఞానికం : మితాహారం తీసుకోవడం వల్ల మధుమేహం దూరం అవడమే కాకుండా మాంసాహారం లాంటి భయంకరమైన కొవ్వు పదార్థాల నుంచి గుండెను కాపాడుకోవచ్చు.
పాదరక్షలు లేకుండా..

lord_ayyappa-0
ఆధ్యాత్మికం : పాదరక్షలు అపరిశుభ్రతకు చిహ్నం. వాటితో దైవ సన్నిధికి చేరకూడదు.
తాత్వికం : శబరిమలకు వెళ్లే దారంతా అడవి మార్గం. కొండ రాళ్ల మధ్యన పాదరక్షలు లేకుండా నడవడం, ఎక్కడం సాధ్యం కాదు. దీనికి ముందస్తు సాధనే పాదరక్షల విస్మరణ.
వైజ్ఞానికం : భూమికి ఉష్ణోగ్రత, అయస్కాంత తత్వం ఉంటాయి. పాదాలు నేరుగా భూమిని స్పర్శిస్తుండటం వల్ల భూ స్థితికి తగిన రీతిలో రక్త ప్రసరణలు, హృదయ స్పందనలు సమమవుతాయి. ఎప్పుడైనా బాగా తిరిగి చెప్పులు లేదా బూట్లు వదిలేశామనుకోండి చాలా విశ్రాంతిగా ఉంటుంది. దానికదే కారణం.
కటిక నేల మీద పడుకోవడం

aaa

ఆధ్యాత్మికం : భూమి తల్లితో సమానం. నేలపై పడుకుంటే దేవుని ఒడిలో పడుకున్నట్టే.
తాత్వికం : హంస తూళికా తల్పాలు ఇవ్వలేని మనశ్శాంతి, సుఖం భూశయనం ఇస్తుందనేది ప్రాచీణుల విశ్వాసం. మనసు మొత్తం కకావికలం అయినప్పుడు భూమి మీద నిశ్చలంగా కొద్దిసేపు పడుకుంటే అన్నీ దూరమవుతాయని యోగ శాస్త్రం చెబుతుంది.
వైజ్ఞానికం : ప్రతి వస్తువుకు కొంత సర్క్యూట్ లో శక్తి కిరణాలు ఉంటాయని విజ్ఞాన శాస్త్ర ప్రతిపాదన సమాంతర స్థితిలో శక్తిమార్పిడి పొందుతుంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది.
అన్ని విధాలా మేలు
అయ్యప్ప దీక్ష చేయడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మేలే జరుగుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి మనిషి పోషకాలు లేని ఎన్నో రకాలైన తినుబండాలు తింటూ అనారోగ్యం పాలవుతూ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష చేసే స్వాములు శాఖాహారం, సాత్విక ఆహారం, అల్పాహారం తీసుకుంటారు. దీంతో స్వాములకు విటమిన్లు సమృద్ధిగా లభించి రక్తప్రసరణ వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
మధుమేహం, బీపీ లాంటివి అదుపులో ఉంటాయి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే స్వాములు నదీ స్నానం చేయడం కోసం నదులు, చెరువులు, బావులకు వెళ్తుంటారు. కొందరు నదిలో మురుగు నీరు ఉన్నా అక్కడే స్నానం చేస్తుంటారు. దీని వల్ల చర్మ వ్యాధులు, చెవిలో చీముకారడం వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చోట జాగ్రత్తగా ఉండాలి.

img_20161106_110030

Category:

Interesting news