ఈ ఫోటో గుర్తుందా… ఇప్పుడీ పాప వయసెంతో, ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారుparle-baby

పార్లేజీ బిస్కెట్స్. చిన్నప్పుడు చాలామంది పిల్లలు తినే బిస్కెట్స్ ఇవి. బ్రిటీష్ కంపెనీలు రాజ్యమేలుతున్న కాలంలో ఈ ఇండియన్ బిస్కెట్స్ కంపెనీ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. 1929లో ముంబై కేంద్రంగా చిన్న కంపెనీగా మొదలైన ఈ బిస్కెట్స్ మేకింగ్ కంపెనీ ఇప్పుడో మహావృక్షమైంది. ప్రస్తుతం 33లక్షల డిస్ట్రిబ్యూషన్ ఔట్‌లెట్స్‌తో మిగిలిన కంపెనీలు చేరుకోలేని స్థానంలో పార్లేజీ ఉంది. కోల్‌కత్తా, ఢిల్లీ, కరాచీ, చెన్నై వంటి మేజర్ సిటీల్లో ఈ కంపెనీ ఫ్యాక్టరీలున్నాయి. 2011లో నిర్వహించిన నీల్సన్స్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడుపోతున్న బిస్కెట్స్‌గా పార్లేజీ రికార్డు సృష్టించింది. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకనే సందేహం మీకు కలగవచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.

పార్లేజీ ప్యాకింగ్ కవర్ గుర్తుంది కదూ. ఈ కవర్ పైన ముద్దులొలికే రూపంతో ఉన్న ఓ పాప ఫోటో కనిపిస్తోంది. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ ఆ ప్యాకింగ్ కవర్‌ డిజైన్‌లో కానీ, ఫోటోలో కానీ ఎలాంటి మార్పు లేదు. అసలు విషయమేంటంటే ఆ పాపకు ఇప్పుడు 65 సంవత్సరాలు. ఆ బామ్మగారి పేరు నీరూ దేశ్‌పాండే. స్వస్థలం నాగ్‌పూర్. ఆ పాప ఈ బామ్మే అని గుర్తించి నేషనల్ ప్రింట్ మీడియాలోని కొన్ని పత్రికలు ఆమె ఫోటోను ప్రచురించి ఇంటర్వ్యూతో కూడిన ఆర్టికల్స్ ప్రచురించాయి. దీంతో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో ఆమె ఫోటో పార్లేజీ కవర్‌పై ప్రింట్ అవ్వడానికి గల కారణమేంటో నీరూదేశ్ పాండే చెప్పేశారు. ఆమె తల్లిదండ్రులు సుధామూర్తి, గుంజన్ గుండానియా. నీరూ తండ్రి ఫ్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఒకరోజు ఫోటో తీశారు. అదే సమయంలో పార్లేజీ ప్యాకింగ్‌పై చిన్నపిల్లల ఫోటోల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ ఫోటో చాలా అందంగా రావడంతో నీరూదేశ్‌పాండే తండ్రి పార్లేజీ ఆఫీస్‌కు ఆ ఫోటోను పంపించారు. ఫోటో చూసిన యాజమాన్యం మరో ఆలోచన లేకుండా నీరూదేశ్ పాండే ఫోటోను ప్రచురించింది. ఆ ఫోటోలో ఉన్నది నీరూనేనని పార్లేజీ గ్రూప్ ప్రొడక్షన్ మేనేజర్ మయనక్ షా తెలిపారు. ఇదీ ఈ ఫోటో వెనకున్న అసలు కథ.

parle-now

Category:

Interesting news