wp-1477124019731.jpg

ప్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియా) : ధూమపానప్రియురాలైన ఓ చింపాంజీ రోజుకు ఓ పెట్టె చొప్పున సిగరెట్లు ఊదేస్తున్న వింత ఘటన ఉత్తర కొరియా దేశంలోని ప్యోంగ్యాంగ్ నగరంలో తాజాగా పునర్ ప్రారంభించిన జంతుప్రదర్శనశాలలో జరిగింది.దల్లాయే అనే పేరు గల 19 ఏళ్ల ఈ చింపాంజీ లైటర్ సాయంతో స్వయంగా సిగరెట్ వెలిగించుకొని ఉఫ్ అంటూ ఊదేస్తుంటే…ఈ విచిత్రాన్ని చూసేందుకు జూలో సందర్శకులు బారులు తీరుతున్నారు. జూ లో శిక్షకుడు లైటర్ అందిస్తే చింపాంజీ దాన్ని దర్జాగా వెలిగించి పెట్టేలోనుంచి సిగరెట్ తీసి ఉఫ్ అంటూ రింగురింగులుగా పొగ వదులుతుండటం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిగరెట్ తాగాక చింపాంజీ శిక్షకుడి సూచన మేర డ్యాన్స్ చేస్తూ చూపరులను అలరిస్తోంది. చింపాంజీనే కాదు ఈ జంతుప్రదర్శనశాలలో ఉన్న ఏనుగులు, జిరాఫీలు, పెంగ్విన్ పక్షులు, కోతులు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయట. అయితే ఈ సిగరెట్ల తాగుబోతు చింపాంజీని చూసేందుకు మనమూ ఓ సారి ప్యోంగ్యాంగ్ జంతుప్రదర్శనశాలకు వెళ్లొద్దామా మరి.!

Category:

Interesting news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*