wp-1478091500056.jpg
ఈ కాలంలో ఎలాంటి సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ లో దొరికిపోతుంది. ప్రపంచంలో జరుతున్న ఏ విషయానైనా నిమిషాల్లో అందిస్తుంది ఇంటర్నెట్. వీటితో పాటు అవసరమయ్యే ఎన్నో విషయాలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. తరచుగా ఇంటర్నెట్ వాడే వారు ఈ కింద ఇచ్చిన పనులు చేస్తే జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి… తస్మాత జాగ్రత్త…!!

wp-1478090527030.jpg

* మీ ఇంట్లో ఓపెన్ వైఫై కనెక్షన్ ఉంటె మీరు జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న ఓపెన్ వైఫై ని ఎవరైనా తప్పుడు పనులకు వాడుకుంటే ఆ నింద మీపై పడే అవకాశం ఉంది. బారీ కోవర్ట్ అనే అతను ఇలానే అరెస్ట్ అయ్యాడు. తన పక్కింటి అతను బారి కి తెలియకుండా ఓపెన్ వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుతూ అందులో చిన్నపిల్లల నీలి చిత్రాలను చూసేవాడట. పోలీసులు ముందు బారీని అరెస్ట్ చేసి ఓ నెల తరువాత అసలు నేరస్తుడిని పట్టుకున్నారు. కేవలం ఇంట్లో ఉన్న వైఫై కే కాదు మీ ఫోన్ లో ఉన్న హాట్ స్పాట్ కి కూడా పాస్-వర్డ్ పెట్టుకోవడం మరువకండి.
wp-1478090674429.jpg
* ఇంటర్నెట్ లో ఎన్నో కొత్త విషయాలు సెర్చ్ చేస్తూ ఉంటాం..! అలాగే ఒక్క రోజులో కొన్ని వందలో పేజీలను ఓపెన్ చేస్తాం. ఇలా మనం ఇంటర్నెట్ లో చేసిన ఆక్టివిటీస్ అన్ని హిస్టరీ లో సేవ్ అవుతాయి. అప్పుడప్పుడు ఆ హిస్టరీ ని డిలీట్ చేస్తూ ఉంటాం. కాని అలా చేయడం వల్ల మీరు జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియా లో ఇలాంటి చట్టాన్ని ప్రవేశాబెట్టారు. బ్రౌజింగ్ హిస్టరీ ని కనీసం 3 నెలలు అలాగే ఉండనీయాలని రూల్ పెట్టారు. కాని భారి సంఖ్యలో ప్రజలు దీనికి ఒప్పుకోకపోవడంతో ఈ రూల్ ని తీసిపారేశారు.

wp-1478090767801.png

ప్రమాదకర మెసేజ్స్, పోస్టులు లేదా ట్వీట్స్ పెడితే మీరు జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. లండన్ కు చెదిన ఇద్దరు యువకులు ఇలానే అరెస్ట్ అయ్యారు. అమెరికాకు వెళ్తున్న వీరు తమ ట్విట్టర్ ఎకౌంటులో ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ లో ఇలా రాశారు “Free this week for a quick gossip/prep before I go and destroy America” (నేను అమెరికాకి వెళ్లి దాన్ని నాశనం చేసే లోపే….. ఈ వారం ఫ్రీ అయ్యి.. కాస్త మాట్లాడుకుందాం.) దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 5 గంటల పాటు ఇంటరాగేట్ చేశారు.
wp-1478090838014.jpg

VOIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) ను ఇథియోపియా దేశంలో వాడడం చట్టరీత్య నేరం. ఈ దేశంలో స్కైప్ లాంటి యాప్స్ వాడితే అరెస్ట్ చేస్తారు.
wp-1478090955032.jpg

వీడియో లో డాన్స్ చేస్తే జైలులో వేస్తారు. ఇది మన దేశంలో కాదులెండి. ఇరాన్ లో ఆరుగురు ఇలానే ఒక వీడియోలో డాన్స్ చేసినందుకు ఒక ఏడాది శిక్ష పడింది. ఆ తరువాత వీరిని 6 నెలలకే విడుదల చేశారు.
wp-1478091138076.png
ఇంటర్నెట్ లో కామెంట్స్ పెట్టినా అరెస్ట్ చేస్తారు. సిరియా దేశంలో ఇది చాలా పెద్ద నేరం.

wp-1478091153527.jpg
ఇంటర్నెట్ లో జూదం ఆడడం ఎన్నో దేశాల్లో నేరంగా భావిస్తారు. గాంబ్లింగ్, పోకర్, బ్లాక్ జాక్ లాంటివి ఆడడం వల్ల మీరు జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

* ఇంటర్నెట్లో ఏదైనా పాట లిరిక్స్ పెడితే మీరు జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫేస్ బుక్ లో రాప్ లిరిక్స్ పెట్టినందుకు అమెరికాలో డీ అంబ్రోసియో అనే స్టూడెంట్ ని అరెస్ట్ చేశారు. ఈ లిరిక్స్ లో టెర్రరిజంకి సంబంధించిన పదాలు వాడినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. ఇలా చేస్తే 20 ఏళ్ళ వరకు జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

wp-1478091172527.jpg
ఎన్నో దేశాల్లో ఇంటర్నెట్ ద్వారా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ పంపిచడం పెద్ద నేరమేమి కాదు. కాని కొన్ని దేశాల్లో ఇది చట్టరీత్య నేరం. ఇలా చేస్తే పైరసీ కంటెంట్ పంపిస్తున్నారని అరెస్ట్ చేస్తారు.

తప్పకుండా షేర్ చెయ్యగలరు

Category:

Interesting news