abhimaaninews7

0888888888. చూడడానికి వెరైటీగా ఉన్న ఈ ల్యాండ్‌లైన్ నెంబర్‌పై తాజాగా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నెంబర్ వాడిన వారంతా చనిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వాటిని పూర్తిగా పుకార్లని కొట్టిపారేయలేం. అలాగని ఆ నెంబర్ వాడినవారంతా చనిపోతున్నారని కూడా చెప్పలేం. ఈ నెంబర్‌ను మొట్టమొదటిసారిగా వినియోగించిన మొబీటెల్ కంపెనీ సీఈవో క్యాన్సర్‌తో చనిపోయారు.

wp-1477886410152.jpg

కానీ బిజినెస్‌లో నెలకొన్న వివాదాలే ఆయన చావుకు కారణమని ఆ తర్వాత కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఇదే నెంబర్‌ను ఉపయోగించిన కన్‌స్టాన్‌టిన్ డిమిట్రోవ్ అనే డ్రగ్ మాఫియా డాన్ ప్రత్యర్థుల చేతిలో నెదర్లాండ్స్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. అతను చనిపోయే సమయంలో ఫోన్ అతనితో పాటే ఉందని చెప్పుకుంటారు. ఇక ఇదే నెంబర్‌ను వాడిన మూడో వ్యక్తి వ్యాపారవేత్త డిష్‌లివ్. బల్గేరియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్ ఎదురుగా ఇతను కూడా 2005లో దారుణ హత్యకు గురయ్యాడు. 2005 తర్వాత ఈ నెంబర్‌కు కాల్ చేసిన వారికి ఔట్‌సైడ్ నెట్‌వర్క్ కవరేజ్ అనే సమాధానమే వస్తోంది. ఈ చావులకు, ఫోన్ నెంబర్‌కు సంబంధం ఉన్నా, లేకపోయినా ఇలాంటివి కూడా నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారన్నది మాత్రం వాస్తవం.

Category:

Interesting news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*