wp-1479174308802.jpg
లాటరీలో దాదాపు రూ.60 లక్షలు(70వేల పౌండ్లు) గెలుచుకున్న ఓ వ్యక్తి అనూహ్యంగా జైలు పాలయ్యాడు. వెస్ట్ లండన్‌లో కుటుంబంతో నివసించే భారత సంతతికి చెందిన బల్విందర్ మల్హోత్రా(30) ఈ జనవరిలో లాటరీలో 70 వేల పౌండ్లు గెలుచుకున్నాడు. గెలుచుకున్న డబ్బులను పూర్తిగా కుటుంబానికే వినియోగిస్తానని అప్పట్లో పేర్కొన్నాడు. భార్యతో విషయం చెప్పి కుటుంబమంతా కలిసి పండుగ చేసుకున్నారు. లాటరీ డబ్బులతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని బాసలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా జూన్‌లో ఇంట్లో నిర్వహించిన పిక్నిక్ పార్టీలో భార్యభర్తల చిన్నపాటి వివాదం మొదలైంది. దీంతో సహనం కోల్పోయిన బల్విందర్ భార్య హర్దీప్‌కౌర్(28)పై పిడిగుద్దులు కురిపించాడు. తన ఐదేళ్ల చిన్నారినీ చితకబాదాడు. వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బల్విందర్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే భార్య, తన ఐదేళ్ల చిన్నారికి వెయ్యి పౌండ్ల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. నియంత్రించుకోలేని కోపం అతడిని కుటుంబం నుంచి దూరం చేసింది. కుటుంబంలో చిచ్చురేపింది. ప్రస్తుతం బల్విందర్ కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.

Category:

Interesting news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*